Wednesday, 25 May 2011

గృహసహాయినివ్రతరాజము పనిమనిషి వ్రతము




గృహ సహాయక వనితా వ్రత రాజము (పని మనిషి వ్రతము )



   ఏకథా నైమిశారణ్యే సూతం పౌరణికం ఖలు  -- ఒకానొకప్పుడు నైమిశారణ్యంబున సూత పురణీకుడు శౌనకాది మునులకు వేద శాస్త్రంబులు బోధించు చుండగా ,వాయు భక్షకులును పర్ణ భక్షకులు నగు మునివరులు ఇట్లనిరి 



  మునివరా భూలోకంబున జంబూ ద్వీపమున భరత ఖండంబున ఉద్యోగాసక్తులైన మధ్య తరగతి  మహిళలు గృహాసహయిని  దొరకక అనేక ఇడుములు పడుచున్నవారు .వారి కష్టములు  కడదేర్చుటకు ఏమైనా  వ్రతము గాని పూజ కానీ కలదా అని అడిగిరి . అంతట సూత పూరాణీకుడు ఇట్లనెను



  మునివర్యులారా మీకు కలిగిన సందేహము పూర్వము  నారద మునీందృనకు కూడా కల్గెను , అది ఎట్లనగా త్రిలోక సంచారి యగు నారద మునీంద్రుడు వైకుంఠమున శ్రీ  శ్రీమన్నారాయణ మూర్తి ని దర్శించి ఇట్లనెను
నారాయణ నారాయణ   ఓ దేవ దేవా స్వర్గ లోక
మహిళలు రంభ ఊర్వ
శులు ఇంటి పని లేక
నిరంతరము సురాపానము చేయుచు తపోధనులను
ప్రలోభ పరచుచూ ఉండగా ,మర్థ్స్య లోకమున
మహిళలు ఇంటి పని వంట పని చేయుచు  ధన
ప్రాప్తి కొరకు కచేరీలలో కూడా  పని చేయుచు క్షణము తీరిక లేక అనేక కష్టములను పడుచున్నారు.
వారికి
ఇంటిపనిలో సహాయమునకుఎవ్వరును దొరకకపురుషులవలే భానువారము పండుగ పబ్బములందును శలవు
లేక భర్త బిడ్డల చాకిరీతో శ్రమ నొందుచున్నారు.



ఆదివిని శ్రీమన్నారాయణుడు చిరునగవుతో ఇట్లనెను “ ఓ నారదా
దీనికై
గృహసహాయినిప్రాప్తివ్రతముగలదు” భూలోకమందు ఏ మహిళ ఈ
వ్రతమునాచరించునో ఆమెకుచక్కటిపనిమనిషి లభించును. ఏ ఇబ్బందులు  ఉండవు



శ్రీమన్నారాయణుడు ఈవ్రతవిధానమునుఇట్లు తెలియజేసేను



గృహిణి పనిమనిషితో బేరసారములాడరాదు.గృహసహాయిని నెలకుఎంత
రుసుమడిగిన అంత ఇవ్వవలెను .సహాయిని ఆలస్యముగావచ్చిననూ ఆమెను నిందింపరాదు. ఆమె
ఇంటికివచ్చినవెంటనే గృహిణి ఆమెను చిరునవ్వుతో పలకరించి చిక్కటి వేడి అల్లం తేనీరు
ఇచ్చికొంతసేపు నగరములోని చలనచిత్రములనుగూర్చి ముచ్చటించవలెను.దూరదర్శన ప్రసారిత
అతిపెద్ద ధారావాహికలనుగూర్చి మాటలాడి పనిమనిషిని ప్రసన్నము చేసికొనవలెను .ఆమెకు
అల్పాహారము అనగా వడలు ఇడ్లీలు దోశెలు పెట్టి సంతుష్టురాలను చేయవలేను.ఆమెను పనికి
తొందరపెట్టరాదు.ఆమె ఏరోజు పనిలోనికి రానియెడల ఆరోజు జీతముతో కూడిన శలవుగా
పరిగణించి ఆరోజు పని భర్త చేత చేయించవలెను.భర్తలు పనిమనిషికి  వినయ విధేయతలు చూపవలెను. ఆమెకు వారమునకొక
అద్దెచలనచిత్రము చూపవలెను. నెలకొక చీర కొనవలెను. ప్రతీ పండుగకూ అదనపు కానుక
ఇవ్వవలెను.ఆమెకు ఏమాత్రము అనారోగ్యము కలిగిన ఆమె వైద్య సేవలఖర్చులు భరించవలెను.
ఆమెపిల్లలనుఇంటిలో ఆడుకొననివ్వవలెను. ఇట్టి షరతులతో వచ్చు గృహసహాయికనుప్రొద్దుననే



ఉచితాసనమున కూర్చుండ బనిచి పాదములు కడిగి
ఆనీరు శిరస్సున చల్లుకొనవలెను.



“మమ” అనుకోండి



శ్వేతవరాహకల్పే – వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూ
ద్వీపే భరతవర్షే భరతఖండే ****** మాసే కృష్ణ/ శుక్ల పక్షే  *****(తిధి) *****వాసరే శుభ తిధౌ శుభ నక్షత్ర
శుభ యోగ శుభ కరణే అస్మతు (ఎవరి పేరు గోత్రము వారు) చెప్పుకోవలెను
----విశ్రాంతి  మానసిక శాంతి సిద్ధ్యర్ధం



గృహసహాయిని
వ్రతం  కరిష్యే
. నీళ్ళు
ముట్టుకోండి



పాదౌ పూజయామి—గంధము



హస్థౌ పూజయామి – పసుపు



జానుమ్ పూజయామి—పుష్పాలు



శిరః పూజయామి – అక్షింతలు



సర్వాంగం పూజయామి  .



ఇట్లు ఆమెను షోడశోపచారంబుల పూజించి



ఆమెముందు ఫలములుమధుర వంటకములు ఉంచి



ప్రాణయస్వాహా అపానయస్వాహాఉదానాయిస్వాహా ********* అనుచూ నైవేద్యము పెట్టవలెను.



ఆమె ఇచ్చిన ప్రసాదము గృహిణి  భుజింపవలెను.ఆమె భర్త తరువాత కొంచెము(మిగిలితే)
తినవలెను.



“గృహసహాయి మహాదేవీ ప్రాతః
ప్రార్థనమర్హతీ



నిందా వ్యంగ్య విసర్జ్యంతి పనిమనిషిర్నమోస్తుతే”



అను మంత్రము చదివి 



మంగళ హారతి ఇవ్వవలెను. ఆమె పిల్లలకు పవళింపుసేవ చేయవలెను



ఫలశ్రుతి



ఏ మహిళ ఈరకముగా వ్రతమాచరించునో ఆమెకు నిత్యము  మంచి పనిమనిషి దొరకును



అట్టి మహిళలు విదేశములకేగినప్పుడు ఆమె తల్లి లేక అత్తగారు
ఉచితసేవ చేయుటకు విదేశములు వెళ్ళుదురు



                      సమాప్తం



              ఇరగవరపు జగన్నాథస్వామి – విరచితము










 






















 

No comments:

Post a Comment